వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవర్నీ మర్చిపోను, గుర్తుపెట్టుకొంటా..!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ మీటింగ్ ను నేడు నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వైసీపీ గ్రామసింహాలు అంటూ ప్రసంగం పవన్ ప్రసంగం ప్రారంభించారు. గ్రామసింహాలంటే.. కొన్ని నిఘంటువుల ప్రకారం.. ఎక్కువ వాగి పళ్లు రాలగొట్టించుకొనే కుక్కలు అంటూ పవన్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు భయం అంటే నేర్పిస్తా.. కులాల చాటున దాక్కుంటే లాకొచ్చి కొడతా.. గుంటూరు బాపట్లలో పుట్టినవాడిని నాకు బూతులు రావా..? రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడట్లేదు. నా వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్, మీ వ్యక్తిగత జీవితాలు రంగులమయం’ అని పవన్ తెలిపారు.

వివేకా హత్య కేసుపై అడిగితే.. నా వ్యక్తిగతం గూర్చి మాట్లాడుతున్నారు. కోడి కత్తి ఘటన చేసింది ఎవరు..? ప్రతి సన్యాసితో నేను ఎందుకు తిట్టించుకోవాలి..? నా వ్యక్తిగత జీవితంపై కూడా జగన్ చాలా సార్లు మాట్లాడారు. నేను మాట్లాడలేక కాదు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు. మీరు తిట్టిన కొద్దీ నేను బలపడతాను, తప్ప బలహీనపడను. ఎవర్నీ మర్చిపోను, గుర్తుపెట్టుకొంటా..! ఎవర్నీ ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు.. రాజకీయాల్లో కలుపుమొక్కల్ని తీసేయాలి.

మా నాన్న సీఎం కాదు.. మా మామ సీఎం కాదు. మా నాన్న నాకు ఇడుపులపాయ లాంటి ఎస్టేట్ ఇవ్వలేదు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం ఉంది. యోగ మార్గంలోకి వెళ్లిన నన్ను.. బాధ్యతలు తప్పించుకుంటున్నావని అంటే తప్పని సరి పరిస్థితుల్లో సినిమాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాను’ అని పవన్ తెలిపారు.

-Advertisement-వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవర్నీ మర్చిపోను, గుర్తుపెట్టుకొంటా..!

Related Articles

Latest Articles