‘సత్యాగ్రహి’ని గుర్తు చేసుకున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన ఆగిపోయిన సినిమా ‘సత్యాగ్రహి’ని గుర్తు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏఎమ్ రత్నం పవన్ కళ్యాణ్ తో ‘సత్యాగ్రహం’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సారథ్యంలో ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం గురించి ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో ‘సత్యాగ్రహం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. “కాంటెంపరరీ టైమ్స్ లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘ఎమర్జెన్సీ ఉద్యమం’ నుండి ప్రేరణ పొందిన రాజకీయ చిత్రం. 2003 లో సినిమా ప్రారంభమైందా ? (నేను అనుకుంటున్నాను). ఈ సినిమాను ఆపేశారు. అయితే సినిమాలో నటించడం కంటే టాక్ నడవడం మరింత సంతృప్తినిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు.

Read Also : ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు

మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ‘వకీల్ సాబ్’ జాతీయ అవార్డు గెలుచుకున్న ‘పింక్’ అనే హిందీ చిత్రానికి రీమేక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీర మల్లు’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

-Advertisement-'సత్యాగ్రహి'ని గుర్తు చేసుకున్న పవన్

Related Articles

Latest Articles