శభాష్ … స్టాలిన్ పై పవన్ అభినందనల వర్షం

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనసేనాని పవన్కళ్యాణ్ అభినందనల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శప్రాయంగా మారాయి. ఇటీవల కాలంలో ఆయన చేసిన కామెంట్స్ లో అసెంబ్లీలో ఎవరికైనా పొగిడే ఉద్దేశం ఉంటే మానుకోవాలని, అలాంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే బ్యాగుల పై రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు ఉండగా, అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాగులపై ఫోటోలు మార్చడానికి చాలా ఖర్చు అవుతుందని, అదేదో పేదల అభివృద్ధికి ఆ డబ్బులు ఖర్చు పెడితే వారికి మంచి జరుగుతుందని అన్నారు. దీంతో స్టాలిన్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా జనసేన ట్విట్టర్ అకౌంట్లో స్పెషల్ నోట్ విడుదల చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారింది.

Read Also : పుకార్లకు చెక్… ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్

“జనసేన అధ్యక్షుడు
శ్రీ స్టాలిన్ గారికి శుభాభినందనలు

ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ – ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు.

పవన్ కళ్యాణ్, అధ్యక్షులు- జనసేన” అంటూ ట్వీట్ చేశారు పవన్.

Related Articles

Latest Articles

-Advertisement-