ఏపీలో వన్ మ్యాన్ షో చేస్తున్న జనసేనాని?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ యువరాజ్యం అధినేతగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలో పవన్ ప్రచారం చేయగా.. చిరంజీవి ఏపీలో ప్రచారం చేశారు. అయితే అనుకున్న రీతిలో ఆపార్టీకి నాడు ఫలితాలు రాలేదు. ఆ తర్వాత వైఎస్ మరణంతో కాంగ్రెస్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర విభజన తదితర అంశాలన్నీ కూడా ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడానికి కారణమయ్యాయి. చిరంజీవి కేంద్రమంత్రి కాగా పవన్ కల్యాణ్ సినిమాలకే పరిమితమయ్యారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోవడంతో చిరంజీవి రాజకీయంగా సైలంటైపోయారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం 2014 ఎన్నికల ముందు సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య బేధాభిప్రాయాలు రావడంతో కిందటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వామపక్ష పార్టీలతో కలిసి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు.

అయితే ఈ ఎన్నికలకు జనసేన అధినేతను తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. జనసేనకు కేవలం ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే వచ్చింది. పవన్ స్వయంగా రెండుచోట్ల ఓడిపోయారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన జనసేనను లైట్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం అటూ సినిమాలు చేస్తూనే రాజకీయంగానూ యాక్టివ్ గా ఉంటున్నారు. టీడీపీ పోషించాల్సిన ప్రతిపక్ష పాత్రను జనసేన పోషించే స్థాయికి తీసుకెళ్లారు.

ప్రజా సమస్యలపై గళం విప్పుతూ వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల జనసేన చేపట్టిన రోడ్ల సమస్య రాజకీయంగా హీట్ ను పెంచుతోంది. వైసీపీ, జనసైనికుల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ నేడు రాజమండ్రిలో శ్రమదాన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఆయన శ్రమదాన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో వైసీపీ సర్కారు కావాలనే జనసేన కార్యక్రమాలు అనుమతి ఇవ్వడం లేదని ఆపార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ను చూసి వైసీపీ సర్కారు భయపడుతోందని.. అందుకే రోడ్ల శ్రమదానానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ శ్రమదానం వేదికను మార్చుకున్నారు. అయితే అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకున్నా జనసేనాని ముందుగా ప్రకటించిన కార్యక్రమం కొనసాగుతుందని ఆపార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో రాజమండ్రిలో పొలిటికల్ హీట్ మొదలైంది.

మరోవైపు వైసీపీనే అనవసరంగా జనసేనానికి హైప్ క్రియేట్ చేస్తుందనే టాక్ విన్పిస్తోంది. పవన్ కల్యాణ్ రాజమండ్రికి వచ్చినా ఓ రెండు, మూడు గంటలు మాత్రమే ఉండి వెళుతారని అంటున్నారు. పవన్ ఫుల్ టైం పొలిషియన్ కాదని ప్రజలందరికీ తెలుసుని అలాంటప్పుడు ప్రభుత్వం ఇందుకు ఇంత రాద్దాంతం చేసుందని విమర్శిస్తున్నారు. వైసీపీనే పవన్ ఇమేజ్ ను రాజకీయంగా మరింత పెంచుతూ పొలిటికల్ హీరోగా మారుస్తుందనే చర్చ నడుస్తోంది. ఏదిఏమైనా కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్ ఏపీలో వన్ మ్యాన్ షో చేస్తుండటం విశేషం.

-Advertisement-ఏపీలో వన్ మ్యాన్ షో చేస్తున్న జనసేనాని?

Related Articles

Latest Articles