వైసీపీ నేతలకు పవన్‌ కల్యాణ్ కౌంటర్.. మరింత ఘాటుగా..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఏపీ సర్కార్‌, సీఎం, మంత్రులపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు మంత్రులు, వైసీపీ నేతలు.. తాజాగా సినీ దర్శకనిర్మాణ, నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పవన్‌ కల్యాణ్‌పై పదునైన విమర్శలు చేశారు. అయితే, సోషల్‌ మీడియా వేదికగా మంత్రి ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ.. ఓ పద్యం రూపంలో… “తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే…” అంటూ మరింత ఘాటుగా ట్వీట్‌ చేశారు.. ఇక అంతే కాదు.. నాకు ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అంటూ.. “హూ లెట్ ది డాగ్స్ అవుట్” సాంగ్‌ లింక్‌ను షేర్‌ చేశారు పవన్‌ కల్యాణ్… ఆ ఒరిజినల్‌ వెర్షన్‌ పూర్తి సాంగ్‌ ఇదిగో అంటూ.. లింక్‌ షేర్‌ చేసి మరింత కాకపెంచారు.

-Advertisement-వైసీపీ నేతలకు పవన్‌ కల్యాణ్ కౌంటర్.. మరింత ఘాటుగా..

Related Articles

Latest Articles