పవన్ బర్త్ డే : సినిమాల్లో ‘పవర్’ రాజకీయాల్లో చూపించగలడా…?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఫ్యాన్స్ లో ఎక్కడలేని పూనకాలు వచ్చేస్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ కొద్దిరోజుల్లోనే పవర్ స్టార్ గా ఎదిగిపోయాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా చిత్రసీమలో తనకంటూ ఓ స్టార్డమ్ ను ఏర్పరుచుకున్నాడు. సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేసే పనిలో బీజీగా ఉన్నారు.

ఒక్కటి రెండు ప్లాపులకే అడ్రస్ లేకుండాపోయే హీరోలు ఎంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు. పవన్ విషయంలో మాత్రం ఇది భిన్నంగా కన్పిస్తుంది. కొన్నాళ్లపాటు హిట్టు లేకపోయిన ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయక మానదు. పవన్ కెరీర్ చూసినట్లయితే హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ కన్పిస్తున్నాయి. ‘తమ్ముడు’, ‘ఖుషీ’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటిదారేది’.. రీసెంట్ గా ‘వకీల్ సాబ్’ వంటి కొన్ని చిత్రాలు మాత్రమే కన్పిస్తాయి.

ఇక పవన్ కెరీర్లో దారుణం పరాజయంగా నిలిచిన ‘అజ్ఞాతవాసి’ సినిమా సైతం దాదాపు 50కోట్లకు పైగా వసూళ్లు సాధించిందన్న టాక్ ఉంది. ఒక స్టార్ హీరో సాధించే వసూళ్లను పవన్ ప్లాప్ సినిమా సాధించగలదు అంటే అతడి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. పవన్ రాజకీయాల్లో ఉంటూనే తాజాగా ‘వకీల్ సాబ్’ మూవీలో నటించారు. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో సినిమాల్లో పవర్ స్టామినా ఏమి తగ్గలేదని అందరికీ అర్థమైంది.

జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్ కు కిందటి ఎన్నికలు పీడకలను మిగిల్చాయి. రెండుచోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ కనీసం ఒక్క చోట గెలువలేదు. ఆ పార్టీ నుంచి కేవలం ఒక్క ఎమ్మెల్యే గెలుపొందగా అతడు కూడా ప్రస్తుతం వైసీపీ పంచన చేరాడు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో వెన్నుచూపకుండా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

పవన్ కల్యాణ్ కాకుండా ఆయన స్థానంలో ఎవరున్న ఇప్పటికే ముఠాముళ్లే సర్దుకొని వెళ్లేవారు. కానీ అక్కడున్నది పవన్ కల్యాణ్. పట్టుదలకు, మొండితనానికి ఆయన నిదర్శనం. తాను ఎంచుకున్న మార్గం పూల‌బాట కాద‌ని.. సుదీర్ఘ ల‌క్ష్యంతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని పవన్ కల్యాణ్ పార్టీ ప్రకటనకు ముందు చెప్పారు. ఇప్పుడు దానిని ఆచ‌రించి చూపిస్తున్నారు.

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయినా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటున్నారు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఆయనకు కలిసి వస్తుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ప‌వ‌న్‌ సినిమాల్లోకి తిరిగి వ‌చ్చినా ఆయ‌న‌పై పెద్ద‌గా విమ‌ర్శలు రాకపోవడానికి ఆయన చెప్పిన సమాధానం అందరనీ మెప్పించేలా ఉంది. తాను బ‌త‌క‌డానికి, త‌న కుటుంబాన్ని పోషించుకోవ‌డానికి త‌న‌కు తెలిసిన విద్య సినిమా మాత్ర‌మేనని.. పార్టీ న‌డ‌పాలంటే ఖ‌చ్చితంగా డ‌బ్బులు కావాల్సిందే కుండబద్దలుకొట్టారు. డబ్బు కోసమే తిరిగి సినిమాల్లో న‌టిస్తున్న‌ట్టు ఓపెన్ గా చెప్పాడు. అదే స‌మ‌యంలో.. విమ‌ర్శ‌లు చేస్తున్న‌వారిని కూడా క‌డిగిపారేశాడు.

రాజ‌కీయాలు చేస్తూ.. వ్యాపారాలు చేసుకుంటే త‌ప్పులేదుగానీ.. సినిమా చేస్తే త‌ప్పా? అన్న ప్ర‌శ్న‌ను జ‌నం సైతం స‌మ‌ర్థించారు. ఆ విధంగా.. అటు సినిమాల్లో, ఇటు రాజ‌కీయాల్లో ముందుకు సాగుతున్నారు. రొటీన్ రాజ‌కీయ నాయ‌కుడిగా కాకుండా మంచి నిర్ణయాలను స్వాగతిస్తూనే ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

పవన్ చేస్తున్న పనులన్నీంటిని ప్ర‌జ‌లు సైతం గ‌మ‌నిస్తారు. ప‌వ‌న్ కు కోట్ల‌ాది మంది ఫ్యాన్స్ ఉన్నా గ‌త ఎన్నిక‌ల్లో పెద్దగా అది ఓటుబ్యాంకుగా మారలేదు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప‌వ‌న్ ఓ వేదిక‌పై చెప్పారు. ‘‘గుండెల్లో అభిమానం ఉంది.. కానీ, ఓటు వైసీపీకి వెళ్లిపోయింద‌ని’’ చెప్పారు. దీంతో రాబోయే ఎన్నికల్లో అయినా అశేషంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ ఆయనకే పట్టంకట్టే అవకాశం కన్పిస్తోంది.

పవన్ కు ఉన్న విశేష ప్రజాభిమానమే మూమ్మటికీ ఆయనకు కలిసి వచ్చే అంశంగా మారనుంది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకెళుతారనేది కూడా ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రాజకీయాల్లో వెన్నుచూపకుండా పోరాడుతున్న పవన్ కల్యాణ్ కు రాబోయే రోజుల్లో ప్రజలు సైతం అండగా నిలిచే అవకాశం లేకపోలేదు. దీంతో అటూ సినిమాల్లోనూ, ఇటూ రాజకీయాల్లోనూ పవన్ కల్యాణ్ ‘పవర్ సెంటర్’గా ఎదగడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఆయన బర్త్ డే సందర్భంగా రాజకీయాల్లో పవన్ పవర్ చూపించాలని కోరుకుందాం..

Related Articles

Latest Articles

-Advertisement-