పవన్-హరీష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అప్పుడే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “సంచారి” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పవన్ తన డేట్స్ ఇచ్చారట. ఈ మేరకు ఆగస్టు నుండి “సంచారి” షూటింగ్ ప్రారంభం కానుంది అంటున్నారు. సంచారి, హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ఒకేసారి జరగనుంది. పవన్-హరీష్ చిత్రంలో ఇంకా హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు. కాగా గతంలో పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పవన్ మలయాళ చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’ తెలుగు రీమేక్, దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-