అమరావతికి ‘నాబార్డ్’ రీజనల్ కార్యాలయం తరలించాలి: పాతూరి

హైదరాబాద్‌లో ఉన్న నాబార్డ్ రీజనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు రాసిన లేఖను… బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులుకు అందజేశారు. ముంబైలో గోవిందరాజులును కలిసి పాతూరి ఈ లేఖను స్వయంగా ఇచ్చారు. ఈ సందర్బంగా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పాతూరి కోరారు. అమరావతిలో ఇప్పటికే కేంద్రప్రభుత్వం నాబార్డుకోసం స్థలాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles