‘పఠాన్, టైగర్3’ వచ్చేది 2023లోనే!

షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’, సల్మాన్ నటించిన ‘టైగర్3’ సినిమాల విడుదల 2023లోనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్3’లో సీరీస్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచైజీ 2021లో విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే కరోనా వల్ల 2022కి మారింది. ఇప్పుడు ఏకంగా 2023లో రాబోతున్నట్లు వినిపిస్తోంది.

యశ్ రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు సినిమాలు ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ ఘన విజయం సాధించాయి. ఇక షారూఖ్ నటించిన యాక్షన్ డ్రామా ‘పఠాన్’ ను 2022 ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారు. సిద్ధార్థ్ అనంద్ దర్శకత్వంలో ఎటాలన్ ఫిల్మ్ కంపెనీతో కలసి యశ్ రాజ్ ఫిలిమ్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇందులో దీపికాపదుకోనే హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ అబ్రహామ్ విలన్ గా కనిపించనున్నారు. ఇందులో సల్మాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఈ సినిమా కూడా విడుదల అయ్యేది 2023లోనే అని తేలింది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు వచ్చేది 2023లోనే అంటూ ప్రముఖ రివ్యూయర్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related Articles

Latest Articles