ఇండియాలో రికార్డు సాధించిన పాట్ కమ్మిన్స్ ట్వీట్…

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ట్వీట్ ఇండియాలో ఓ రికార్డు సాధించింది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ లు కరోనా కారణంగా లాక్ డౌన్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ మొదటి భాగం మన ఇండియాలో జరుగుతున్న సమయంలో ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమ్మిన్స్ ఈ కరోనాను ఎదిరించి పోరాడటానికి $50,000 ప్రధాని కేర్స్ ఫండ్‌ కు విరాళంగా అందిస్తున్నట్లు ట్వీట్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ ఇండియా లో రికార్డు క్రియేట్ చేసింది.

అదేంటంటే… కరోనా సహాయ చర్యల కోసం విరాళం ఇస్తూ కమ్మిన్స్ చేసిన పోస్ట్ భారతదేశంలోనే ఈ ఏడాది అత్యధిక ‘రీట్వీట్ చేసిన ట్వీట్’గా నిలిచింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో ఫైనల్స్ కు చేరిన కేకేఆర్.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి టైటిల్ చేజార్చుకుంది.

Related Articles

Latest Articles