ఫేస్ బుక్, గుగూల్ కు పార్లమెంటరీ కమిటీ ఆదేశాలు…

ఈరోజు పార్లమెంటరీ కమిటీ ముందుకు “ఫేస్ బుక్”, “గుగూల్” ప్రతినిధులు రానున్నారు. త్వరలో యూట్యూబ్, ఇతర సామాజిక సంస్థలు కూడా ఇవే ఆదేశాలు జారీ చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్.పి శశి థరూర్ నేతృత్వంలో ని “ ఐ.టి వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ” ముందు హాజరు కావాలని భారత్ “ఫేస్ బుక్”, “గుగూల్” సామాజిక మాధ్యమాల కు ఆదేశాలు జారీ చేసింది. పౌరుల హక్కుల పరిరక్షణకు, మరీ ముఖ్యంగా మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణలో, సామాజిక మాధ్యమాల వేదికలు దుర్వినియోగం కాకుండా తీసుకోవాల్సిన చర్యల పట్ల ఈ రెండు సమాజిక మాధ్యమాల అభిప్రాయాలను తెలుసుకోనున్నాయి “పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ”. భారత్ రూపొందించిన నూతన ఐ.టి నిబంధనలు అమలు చేసే విషయంలో వరుసగా ఆయా సామాజిక మాధ్యమాల అభిప్రాయాలను తెలుసుకుంటుంది “పార్లమెంటరీ స్ఠాండింగ్ కమిటీ”.

Related Articles

Latest Articles

-Advertisement-