రేపిస్టులకు హెచ్చరిక… రేప్ చేస్తే ఇకపై అది ఉండదట

రేపిస్టులు భయపడేలా పాకిస్థాన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువస్తోంది. రేప్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నేరచట్టం-2021 బిల్లుకు బుధవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తక్షణ చర్యల కోసం ఈ బిల్లును రూపొందించింది. గత ఏడాదే ఈ బిల్లుకు పాకిస్థాన్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Read Also: బాలీవుడ్ నటి హేమమాలినికి అరుదైన గౌరవం

అత్యాచార కేసుల్లో దోషులకు లైంగిక సామర్థ్యం తొలగించే ప్రక్రియను కెమికల్ కాస్ట్రేషన్‌గా పిలుస్తారు. ఈ ప్రక్రియ కోసం వైద్యులు డ్రగ్స్ ఉపయోగించి దోషులు శృంగారం చేయడానికి పనికిరాకుండా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ సహా అమెరికా వంటి రాష్ట్రాలలో ఈ శిక్షను అమలు చేస్తున్నారు. కాగా రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష విధించడం సరికాదని జమాత్ ఎ ఇస్లామి సెనేటర్ ముస్తాక్ అహ్మద్ నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం అని ఆయన అభిప్రాయపడ్డారు.

Related Articles

Latest Articles