అమెజాన్ ప్రైమ్ లో ‘పరిగెత్తు పరిగెత్తు’!

సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. తోట రామకృష్ణ దర్శకత్వంలో ఎ. యామిని కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ తన ఓటీటీలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత యామిని కృష్ణ మాట్లాడుతూ, ”కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టగానే నిదానంగా థియేటర్లు తెరుకున్నాయి. అదే సమయంలో ఎంతో ధైర్యం చేసి, మా ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాను జూలై నెలాఖరులో విడుదల చేశాం. మంచి కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చక్కగా ఆదరించారు. అదే విధమైన స్పందన ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లోనూ రావడం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించడానికి సహకరించిన సన్నిహితులకు, అలానే మా చిత్రాన్ని అటు థియేటర్ లోనూ, ఇటు ఓటీటీలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని అన్నారు.

-Advertisement-అమెజాన్ ప్రైమ్ లో 'పరిగెత్తు పరిగెత్తు'!

Related Articles

Latest Articles