పరేశ్ రావల్… 40 ఏళ్ల తరువాత మళ్లీ…

పరేశ్ రావల్… ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేమికులు దాదాపుగా ఉండరు. అయితే, బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసిన టాలెంటెడ్ యాక్టర్ తెలుగు తెరపై కూడా కనిపించాడు. పలు భాషల్లో నటించిన ఆయన నిజానికి గుజరాతీ. మాతృభాషలో గతంలో కొన్ని చిత్రాలు చేశాడు. అయితే, దాదాపు 40 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి గుజరాతీ పరిశ్రమకి తిరిగి వెళుతున్నాడు పరేశ్…
యాక్టర్ మాత్రమే కాక మంచి రైటర్ కూడా అయిన పరేశ్ రావల్ ‘డియర్ ఫాదర్’ అనే నాటకాన్ని అప్పట్లో రాశాడు. రంగస్థలంపై గొప్ప విజయాన్ని సాధించింది కూడా. అయితే, ఓ ఇంట్లో ముగ్గురు కుటుంబీకుల నడుమ సాగే ఈ కామెడీ డ్రామా ఇప్పుడు గుజరాతీ వెండితెర మీదకి వెళ్లనుంది. వీణస్ ఫిలింస్ బ్యానర్ పై రతన్ జైన్ నిర్మించనున్నాడు. సినిమాలో ఒక కీలక పాత్ర పరేశ్ పోషించనుండగా మరో రెండు క్యారెక్టర్స్ లో చేతన్ ధనాని, మృణ్మయి గోడ్ బోలే అలరించనున్నారు.

“40 ఏళ్ల తరువాత గుజరాతీ సినీ ప్రపంచంలోకి మళ్లీ కాలు పెడుతున్నాను!’’ అంటూ పరేశ్ రావల్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు. కాగా ఆయన నటించిన లెటెస్ట్ బాలీవుడ్ ఎంటర్టైనర్ ‘హంగామా 2’ జూలై 23న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కామెడీ ఎంటర్టైనర్ లో శిల్పా శెట్టి, మీజాన్ జాఫ్రి, ప్రణీత సుభాష్ ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-