తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఉంటుందా..?

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థల సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను మూడు రోజుల ముందుగానే 8వ తేదీ నుంచే ప్రకటించారు. ఇవి ఈ నెల 16తో ముగియాల్సి ఉంది. అయితే, కొవిడ్ కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రభుత్వం వద్ద వ్యక్తం చేశారు.

Read Also: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా త్రిపురనేని జయంతి

ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే అప్పటి వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల సంక్రాంతి సెలవులను కూడా అప్పటి వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం తర్వాతే ఏ విషయమూ అధికారికంగా ప్రకటిస్తామని విద్యాశాఖ పేర్కొంది. అయితే, అదేదో త్వరగా ప్రకటిస్తే పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలా? లేదంటే సెలవులు ముగిసే వరకు అక్కడే ఉండాలా? అన్న విషయంలో నిర్ణయం తీసుకుంటారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు

Related Articles

Latest Articles