ఆడియో రిలీజ్‌ చేసిన పంజ్‌షీర్ నేత.. తిరబడాలని పిలుపు..

ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నా తాలిబన్లకు పంజ్‌షీర్‌లో ఇంకా ప్రతిఘటన ఎదురవుతున్నట్టే తెలుస్తోంది.. అయితే, పంజ్‌షీర్‌ పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు.. తాలిబన్లకు మద్దతుగా పాకిస్థాన్‌ రంగంలోకి దిగింది.. పాక్‌ సీహెచ్ -4 డ్రోన్ పంజ్‌షిర్‌లో ఒక వాహనంపై రెండు క్షిపణులను ప్రయోగించింది. ప్రతిఘటన ప్రతినిధి ఫహీం దష్టి, మరో ఐదుగురు యోధులు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి.. ఆదివారం జరిగిన దాడుల్లో అహ్మద్ మసూద్ సన్నిహితుడు, పంజ్‌షీర్ దళాల చీఫ్ సలేహ్ మొహమ్మద్ దజారీ కూడా మరణించినట్టుగా చెబుతున్నారు.. అయితే, తాగాజా ఓ ఆడియోల రిలీజ్‌ చేశారు పంజ్‌షీర్‌ నేత అహమ్మద్‌ మస్సౌద్.

19 నిమిషాల పాటు ఉన్న ఆ సుదీర్ఘ ఆడియోలో.. తాలిబ‌న్లపై దేశ‌మంతా తిర‌గ‌బ‌డాల‌ని పిలుపునిచ్చారు.. త‌మ ద‌ళాల‌పై మిలిటెంట్లు దాడి చేశార‌ని, మ‌త‌పెద్దల సూచ‌న‌ల‌ను కూడా తాలిబ‌న్లు ప‌ట్టించుకోలేదన్న ఆయన.. తాలిబన్ల దాడుల్లో త‌న స్వంత కుటుంబీకులు కూడా మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు. ఇక, తాలిబ‌న్లకు గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రపంచ దేశాల‌ను తప్పుబట్టిన మస్సౌద్.. సైన్యాన్ని, రాజ‌కీయ విశ్వాసాన్ని తాలిబన్లకు కల్పిస్తున్న దేశాలపై మండిపడ్డాడు.. అయితే, పంజ్‌షీర్‌లో త‌మ ద‌ళాలు ఇంకా బ‌లంగా ఉన్నాయ‌ని, తాలిబ‌న్లతో పోరాడుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు..

Related Articles

Latest Articles

-Advertisement-