సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మెగా హీరో

2020లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల నుంచి ‘ఉప్పెన’లాంటి అభిమానాన్ని రాబట్టుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరో. వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం తమిళ దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రంగ రంగ వైభవంగా, ఆబాల గోపాలం అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని టాక్. ఇదిలా ఉండగా వైష్ణవ్ తేజ్ నాలుగవ సినిమాపై తాజాగా అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.

Read Also : నా సినిమాకే పోటీనా అన్నాడు ?… రామ్ చరణ్ వ్యక్తిత్వంపై స్టార్ డైరెక్టర్ కామెంట్స్

ఈరోజు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాతలు ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో తన 16వ సినిమాను వైష్ణవ్ హీరోగా, ఫార్చ్యూన్ బ్యానర్ తో కలిసి నిర్మించబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ను త్వరలోనే వెల్లడించనున్నారు ప్రకటించారు.

Related Articles

Latest Articles