క‌రోనాకు ముగింపు లేదా?  ఆ దేశాలను ఉక్కిబిక్కిరి చేస్తున్న కేసులు…

ప్ర‌పంచంలో క‌రోనా ఉదృతి ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.  కొన్ని దేశాల్లో త‌గ్గిన‌ట్టు క‌నిపించినా తిరిగి కేసులు పెరుగుతున్నాయి.  కొత్త కొత్త రకాల వేరియంట్లు పుట్టుకురావ‌డంతో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్టడి సాధ్యం కావ‌డంలేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ పేర్కొన్న‌ది.  ఏ దేశంలోనూ క‌రోనా ముగింపుకు రాలేద‌ని, కొత్త వేరియంట్లు ప్ర‌మాద‌క‌ర‌మైన వేర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.  బ్రిట‌న్‌లో జ‌రిగిన యూరోక‌ప్‌, ద‌క్షిణ అమెరికాలో జ‌రిగిన కొపా అమెరికా క‌ప్ కార‌ణంగా ఆయా దేశాల్లో మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయ‌ని, టోక్యోలో ఇప్ప‌టికే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్ధ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.  

Read: రాఘవ లారెన్స్ చిత్రానికి తమన్ సంగీతం!

ఇక‌పోతే, ఇండోనేషియాలో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ఆసియాలో జ‌నాభా ప‌రంగా నాలుగో స్థానంలో ఉన్న ఇండోనేషియాలో కొత్త‌గా 56 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  ఆ దేశంలో వైర‌స్ ఉదృతి ఇండియాను మించిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు.  ఇక‌, సైనిక తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మ‌య‌న్మార్ దేశంలో క‌రోనా వేగంగా వ్యాప్తిచెందుతున్న‌ది. ఆఫ్రికా దేశాల్లో కేసుల‌తో పాటుగా మ‌ర‌ణాల సంఖ్య‌కూడా పెరుగుతున్న‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ స్ప‌ష్టంచేసింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-