ఏపీలో నేడే నగర పంచాయతీ చైర్ పర్సన్ ఎన్నికలు…

ఏపీలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్పోరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మున్సిపల్, నగర పంచాయతీల్లో ఛైర్ పర్సన్ ఎన్నికలు జరగనుండగా… మూడు మండలాల్లో ఎంపీపీ, 6 మండలాల్లో మండల ఉపాధ్సక్ష పదవులకు ఎన్నిక చేపట్టనున్నారు అధికారులు. ఇక విజయనగరం జెడ్పీ ఉపాధ్యక్ష పదవికి నేడే ఎన్నిక జరగనుంది. మొత్తం 130 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు అధికారులు. అయితే ఈ ఎన్నికలో కొండపల్లి పైనే అందరి ఫోకస్ ఉంది. కొండపల్లి నగర పంచాయతీ ఛైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. అక్కడ ఉన్న 29 స్థానాలకు గానూ చెరో 14 దక్కించుకున్నాయి వైసీపీ, టీడీపీ. అయితే టీడీపీకి మద్దతిస్తూ పార్టీలో చేరారు ఇండిపెండెంట్ గా గెలిచిన లక్ష్మీ. దాంతో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకమయ్యాయి.

Related Articles

Latest Articles