సంక్రాంతి పోటీ వెనుక స్టార్ హీరోల హస్తం !

ప్రతిసారి సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ పోటీ నెలకొంటుంది. బాక్స్ ఆఫీస్ బరిలో పెద్ద పెద్ద సినిమాలు నిలవడంతో సందడి సందడిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి మరీ సంక్రాంతికి సినిమాలను చూడడానికి ఇష్టపడతారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి మాత్రం సంక్రాంతి పెద్ద సినిమాల సందడి లేదు. అయితే వరుసగా వారసుల ఎంట్రీ మాత్రం జరుగుతోంది. సంక్రాంతికి దాదాపు ఆరేడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో చెప్పుకోవాల్సిన పెద్ద సినిమా అంటే ‘బంగార్రాజు’ మాత్రమే. కరోనా వల్ల ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి బడా సినిమాలు అన్నీ పక్కకు తప్పుకున్నాయి. ఇక ‘బంగార్రాజు’ను పక్కన పెడితే సంక్రాంతి రేసులో చెప్పుకోదగ్గ సినిమాలు ‘హీరో’, ‘రౌడీ బాయ్స్’ మాత్రమే అన్పిస్తోంది పరిస్థితిని చూస్తుంటే ! ఇక ఈ సంక్రాంతి సినిమాల వెనుక స్టార్ హీరోల హస్తం బలంగానే ఉంది.

Read Also : చిరు, జగన్ భేటీకి నాగార్జున ఎందుకు వెళ్ళలేదు ?

ముందుగా ‘రౌడీ బాయ్స్’ విషయానికొస్తే… మేనల్లుడి మూవీ ఎంట్రీ కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సగం మంది టాప్ హీరోలందరినీ వాడేశాడు. ప్రభాస్ ఈ సినిమాలోని ‘ఏ జిందగీ’ అనే సాంగ్ ను, అల్లు అర్జున్ ‘లేట్ నైట్’ సాంగ్ ను విడుదల చేయగా… ఎన్టీఆర్ ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విధంగా ‘రౌడీ బాయ్స్’కు దిల్ రాజు కారణంగా గట్టి సపోర్ట్ దొరికిందని చెప్పాలి. ఇక రష్మిక, పూజ హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు సైతం ‘రౌడీ బాయ్స్’కు సపోర్ట్ చేస్తుండడంతో సినిమాపై క్రేజ్ ఏర్పడింది.

Read Also : ప్రామిస్ చేస్తున్నా… ‘పుష్ప-2’పై రష్మిక ఆసక్తికర పోస్ట్

ఇక ఆ తరువాత మాట్లాడుకోవాల్సింది సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ‘హీరో’ మూవీ గురించి. ఈ సినిమాకు ఎలాగు మహేష్ బాబు సపోర్ట్ ఉండనే ఉంది. ఇక ‘హీరో’ ట్రైలర్ ను దర్శక దిగ్గజం రాజమౌళి స్వయంగా విడుదల చేశారు. మరోవైపు ఈరోజు జరగనున్న ‘హీరో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానా, రామ్ చరణ్ హాజరు కానుండడం విశేషం. గల్లా అశోక్ కు కూడా ఇదే మొదటి చిత్రం. స్టార్స్ సినిమాకు సపోర్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై కూడా బాగానే హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ‘రౌడీ బాయ్స్’తో పోల్చుకుంటే ‘హీరో’కు సపోర్ట్ తగ్గిందని అంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న ఈ స్టార్ వారసులకు స్టార్ హీరోలు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మరి వీరి సపోర్ట్ మ్యాజిక్ ఎంత మేరకు పని చేస్తుందో చూడాలి. ఇక ‘బంగార్రాజు’ రంగంలో ఉండనే ఉన్నాడుగా ! ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో తేలాలంటే వేచి చూడాల్సిందే.

Related Articles

Latest Articles