హంపీ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీ!

భారత పర్యాటక ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన హంపీ క్షేత్రం నేపథ్యంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది. లండన్ లో చదువుకుని, నటనలో మెళకువలు నేర్చుకున్న హృతిక్ శౌర్య ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కంప్యూటర్ గేమింగ్ లో మోకో గా పాపులర్ అయిన ముంబై ముద్దుగుమ్మ కసిక కపూర్, చెన్నైలో బాక్సింగ్ శిక్షణ పొంది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న షెర్లిన్ సేథ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఫ్లిక్ నైన్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రభాకర్ అలిగే దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే సైతం ప్రభాకర్ సమకూర్చుతున్నారు. పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఈ లవ్, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్ డ్రామా రూపుదిద్దుకుంటుందని, త్వరలోనే షూటింగ్ ఆరంభించి హైద్రాబాద్, హంపి, గోవాలలో మూడు షెడ్యూల్స్ లో ఐదు పాటలు, ఏడు ఫైట్స్, పది యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తామని ప్రభాకర్ తెలిపారు. భారీ నిర్మాణ విలువలతో రూపుదిద్దుకునే ఈ సినిమాను వచ్చే వేసవి సెలవులకు థియేటర్స్ లో విడుదల చేయాలన్నది తమ ఆలోచన అని నిర్మాణ సంస్థ తెలిపింది. వరలక్ష్మి శరత్ కుమార్, నరేష్, పోసాని, పవిత్రా లోకేష్ తో పాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటించబోతోంది. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్.

-Advertisement-హంపీ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీ!

Related Articles

Latest Articles