వనమా రాఘవను ఇంకా అరెస్ట్ చేయలేదు: పాల్వంచ ఏసీపీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. వనమా రాఘవ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి కోసం పోలీసు బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు తెలిపారు. గురువారం సాయంత్రం వనమా రాఘవను అరెస్ట్ చేసి ఖమ్మం తరలిస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయని… ఈ వార్తల్లో నిజం లేదని ఏసీపీ స్పష్టం చేశారు. బహుశా ఆయన తమకు చిక్కకుండా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జరిగితే తాము కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏసీపీ రోహిత్ రాజు తెలిపారు.

Read Also: రాజీనామా చేసే ఉద్దేశం లేదు: జగ్గారెడ్డి

కాగా వనమా రాఘవను ప్రగతిభవన్‌లోనే దాచిపెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను A1గా మార్చాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మనవడిని ఒక్కమాటంటే గగ్గోలు పెట్టిన టీఆర్ఎస్ నేతలకు, సీఎం కేసీఆర్‌కు ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన కనిపించట్లేదా అని ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నించారు.

Related Articles

Latest Articles