పార్టీ మారలేదని కక్షతో చేసారా : పల్లా శ్రీనివాసరావు

నాకు 750 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. 49 ఎకరాలు నా ఆధీనంలో ఉందని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విజయసాయిరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. నిరూపించ లేకపోతే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుండి వెళ్ళిపోతారా.. పార్టీ మారలేదని కక్షతో చేసారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసాను అని అక్కసుతో వేధిస్తున్నారా. మంత్రి గారు అరెస్టు చేస్తామని చెబుతున్నారు.. తెలుసుకొని మాట్లాడితే మంచిది.. విజయసాయిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు. సర్వే నెంబర్ 14 లో చెరువుకు అనుకుని ఉన్న నా స్థలంలో ఫెన్సింగ్ ఉన్న రెండు అడుగులు ప్రదేశాన్ని కొట్టారు.

అయితే విశాఖలో రెండు జగ్గరాజు పేటలు ఉన్నాయి. నాకు యాదవ జగ్గరాజు పేట లో స్థలం ఉంది తప్ప, కాపు జగ్గరాజుపేట లో లేదు. ఎక్కడో స్థలాన్ని కొట్టి,నా స్థలం అంటున్నారు. డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలలోకి రాలేదు. ప్రశాంత్ కిశోర్ వ్యూహాన్ని విజయసాయి రెడ్డి అమలు చేస్తున్నారు. నిన్న నా పై మాట్లాడిన మంత్రి, శాసన సభ్యులు, వైసీపీ నాయకులు చర్చకు రండి. నేను అన్యాక్రాంతం చేసాను అని నిరూపించండి. నేను టిడిపిలో ఉంటాను టిడిపిలోనే చస్తాను, పార్టీ మారే ప్రసక్తి లేదు అని స్పష్టం చేసారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-