‘సీటీమార్’ కంటే ముందే ‘పక్కా కమర్షియల్’ ?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల కావాల్సిన సినిమా తేదీలు, షూటింగ్స్ లో ఉన్న సినిమాల షెడ్యూల్స్ అన్ని తారుమారు అయ్యాయి. ఇదిలావుంటే, టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్-తమన్నా భాటియా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కుతుంది. మరోవైపు గోపీచంద్-రాశిఖన్నా జోడిగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాడు. కాగా సీటీమార్ సినిమా ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ఈ సినిమాతో పోటీపడే సినిమాల లిస్ట్ బాగానే ఉండటంతో వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పక్కా కమర్షియల్ కూడా త్వరలో షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గరగానే సీటీమార్ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే కనుక జరిగితే పక్కా కమర్షియల్ సినిమా తరువాతే సీటీమార్ సినిమా విడుదల కానుందని సమాచారం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-