భారత జలాల్లోకి పాకిస్తాన్‌ బోట్‌..

భారత్‌లోకి ప్రవేశించేందుకు పాకిస్తానీలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రాదేశిక జలాల్లోకి పాకిస్తాన్‌కు చెందిన ఓ బోట్‌ ప్రవేశించడంతో స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన బోట్‌లో ఉన్న 10 మందిని గుజరాత్‌ తీరరక్షక దళం అదుపులోకి తీసుకుంది. అయితే పట్టుబడ్డిని వారిని విచారణ నిమిత్తం పోర్‌ బందర్‌కు గుజరాత్‌ తీరరక్షక దళం తరలించింది.

గుజరాత్‌లో గత నెల 20న కూడా భారత ప్రాదేశిక జలాల్లోకి వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన ఓ బోట్‌ను గుజరాత్‌ తీరరక్షక దళం స్వాధీనం చేసుకుంది. సముద్రమార్గం ద్వారా భారత్‌లోకి వచ్చేందుకు పాక్‌ వాసులు యత్నించినట్లు తెలుస్తోంది. భారత దళాలు పాకిస్తాన్‌ చర్యలను ఎప్పటిప్పుడు తిప్పికొడుతున్నాయి.

Related Articles

Latest Articles