యూఎస్ కీల‌క ప‌రిశోధ‌న‌: పాక్ కు ఇక గ‌డ్డుకాల‌మే…

పాక్‌లో ఉద్ర‌వాద సంస్థ‌లు కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాయ‌ని ప్ర‌పంచ దేశాలు గ‌గ్గోలు పెడుతున్నాయి.  పాక్‌లో ఉన్న ఆ ఉగ్ర‌సంస్థ‌లు ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో మార‌ణ‌హోమాల‌ను సృష్టిస్తున్నాయి.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ల‌కు పాక్ ఇంటిలిజెన్స్ స‌హ‌కారం ఉంద‌నన్న‌ది బహిరింగ ర‌హ‌స్య‌మే.  ఇక ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన కాంగ్రెష‌న‌ల్ రీసెర్చ్ స‌ర్వీస్ పాక్‌లోని ఉగ్ర‌సంస్థ‌ల‌పై కీల‌క ప‌రిశోధ‌న చేసింది.  టెర్రరిస్ట్‌ అండ్‌ అదర్‌ మిలిటెంట్‌ గ్రూప్స్‌ ఇన్‌ పాకిస్థాన్ పేరిట ఓ నివేదిక‌ను త‌యారు చేసి క్వాడ్ స‌ద‌స్సు రోజున రిలీజ్ చేసింది.  12 విదేశీ ఉగ్ర‌వాద సంస్థ‌లు పాక్ కేంద్రంగా ప‌నిచేస్తున్నాయ‌ని… ఇండియా, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో దాడులు చేసేందుకు ఈ సంస్థ‌లు కుట్ర‌లు ప‌న్నుతున్నాయ‌ని ఆ సంస్థ నివేదిక‌లో పేర్కొన్న‌ది.  12 ఉగ్ర‌వాద సంస్థ‌ల జాబితాను వివిధ రకాలుగా వ‌ర్గీక‌రించారు. ఇందులో ఆఫ్ఘ‌నిస్తాన్‌లో దాడులు చేసేవి, భార‌త్‌లో భార‌త్ లో దాడులు చేసేవి, ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాడులు చేసేవి, పాకిస్థాన్‌లో దాడులు చేసేవి, షియా వ‌ర్గానికి వ్య‌తిరేకంగా ప‌నిచేసేవిగా వ‌ర్గీక‌రించారు.  12 విదేశీ ఉగ్ర‌వాద సంస్థ‌ల కార‌ణంగా ప్ర‌పంచంలో శాంతికి విఘాతం క‌లుగుతుంద‌ని యూఎస్ కాంగ్రెష‌న‌ల్ రీసెర్చ్ స‌ర్వీస్ పేర్కొన్న‌ది.  

Read: అదరహో అనిపించిన ఖుష్బూ!

-Advertisement-యూఎస్ కీల‌క ప‌రిశోధ‌న‌:   పాక్ కు ఇక గ‌డ్డుకాల‌మే...

Related Articles

Latest Articles