పాక్ మ‌ళ్లీ పాత‌పాటే… ఆ విమానం కూలిపోలేద‌ని వాద‌న‌…

గ‌తేడాది బాలాకోట్‌పై భార‌త్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.  ఆ మ‌రుస‌టిరోజే పాకిస్తాన్ త‌క ఎఫ్ 16 విమానంతో భార‌త్‌పై దాడి చేయాల‌ని చూసింది.  అయితే, మిగ్ 21 విమానంతో ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేసింది ఇండియా. అయితే, దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్ క్లారిటీ ఇవ్వ‌లేదు.  భార‌త్ కూల్చిన ఎఫ్ 16 విమానం త‌మ‌ది కాద‌ని అప్ప‌ట్లో పాక్ చెప్పింది.  ఇప్పుడు మ‌రోసారి అదే  మాట‌ను పున‌రావృతం చేసింది.  2019 ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ పైల‌ట్ పాకిస్తాన్ ఎఫ్ 16 యుద్ద విమానాన్ని కూల్చాడ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, అవి నిరాధార‌మైన‌వ‌ని పాక్ మ‌రోసారి తెలియ‌జేసింది.  

Read: శీతకాల సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లులు

ఇప్ప‌టికే అమెరికాతో స‌హా అంత‌ర్జాతీయ నిపుణులు ఇదే విష‌యాన్ని తెలియ‌జేశారని పాక్ విదేశాంగ శాఖ తెలియ‌జేసింది.  భార‌త్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ, పాక్ శాంతిని కోరుకుంటోందని, దానికి వ‌ర్థ‌మాన్ అభినంద‌న్ విడుద‌లే ఒక నిద‌ర్శ‌నమ‌ని పాక్ విదేశాంగ శాఖ తెలియ‌జేసింది.  బాలాకోట్ హీరోగా అభివ‌ర్ణిస్తూ వ‌ర్థ‌మాన్‌కు కేంద్రం వీర్‌చ‌క్ర పుర‌స్కారాన్ని బ‌హుక‌రించింది.  రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా వ‌ర్థ‌మాన్ ఈ పుర‌స్కారాన్ని అందుకున‌న్నారు.  ఈ నేప‌థ్యంలో పాక్ మ‌ళ్లీ పాత మాట‌ల‌ను చెప్ప‌డం విశేషం.  

Related Articles

Latest Articles