గుడ్ న్యూస్ చెప్పిన పాక్‌: ఇండియా నుంచి ఆఫ్ఘ‌న్ వెళ్లే వాహ‌నాల‌కు అనుమ‌తి…

ఇండియాకు పాక్ గుడ్‌న్యూస్ చెప్పింది.  ఇండియా నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్‌కు వెళ్లే వాహ‌నాల‌కు అనుమ‌తిస్తూ పాక్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  మాన‌వ‌తా దృక్ప‌దంతోనే వాహ‌నాల‌కు అనుమ‌తులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్‌లు ఆక్ర‌మించుకున్నాక అక్క‌డ ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి.  ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  స‌రైనా ఆహారం అంద‌క అల‌మ‌టిస్తున్నారు.  ఆఫ్ఘ‌నిస్తాన్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  

Read: విచిత్రం: అంత‌పెద్ద పామును ఆ చేప ఎలా మింగేసింది?

కాగా, ఇండియా కూడా ముందుకు వ‌చ్చి 50వేల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ను అందించేందుకు సిద్ధమైంది.. అయితే, ఈ గోధుమ‌ల‌ను ఇండియా నుంచి పాక్ మీదుగా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చేర‌వేయాల్సి ఉంది.  గోధుమ‌ల‌తో పాటుగా మెడిసిన్‌ను కూడా స‌ర‌ఫ‌రా చేసుందుకు ఇండియా ముందుకు వ‌చ్చింది.  మాన‌వ‌తా దృక్ప‌థంతో అనుమ‌తులు ఇస్తున్నామ‌ని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు తెలియ‌జేశారు.  దీంతో సుమారు 500 లారీలు ఇండియా నుంచి ఆఫ్ఘ‌న్‌కు వెళ్లేందుకు మార్గం సుగ‌మం అయింది.  

Related Articles

Latest Articles