ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌… కాశ్మీర్‌లో ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం…

ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాదిని స్పెష‌ల్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  న‌కిలీ దృవ‌ప‌త్రాల‌తో ఢిల్లీలోని ల‌క్ష్మీన‌గ‌ర్ ప్రాంతంలో నివ‌శిస్తున్నాడు.   ఈ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని స‌మాచారం అంద‌డంతో స్పెష‌ల్ సెల్ అధికారులు సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ఉగ్ర‌వాదిని అదుపులోకి తీసుకున్నారు.  పాక్ ఐఎస్ఐ శిక్ష‌ణ ఇచ్చిన‌ట్టు విచార‌ణ‌లో తేలింది.  ఈ ఉగ్ర‌వాది నుంచి ఏకే 47, పిస్ట‌ల్ తో పాటుగా హ్యాండ్ గ్రెనైడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  ఇక ఇదిలా ఉంటే, జ‌మ్మూకాశ్మీర్‌లోని సోఫియాన్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం అయ్యారు.  ఉగ్ర‌వాదులు న‌క్కిఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన భార‌త బ‌ల‌గాలు వారిని లొంగిపోవాల‌ని హెచ్చ‌రించాయి.  అయితే, ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌ర‌ప‌డంతో భ‌ద్ర‌తా ద‌ళం ఎదురు కాల్పులు జ‌రిపింది.  ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం అయ్యారు.  నూర‌న్‌కోట్ ప్రాంతంలో జ‌రిగిన దాడికి భ‌ద్రతా ద‌ళాలు ప్ర‌తీకారం తీర్చుకున్నాయి.  

Read: బొగ్గు కొర‌త‌పై నేడు ప్ర‌ధాని కీల‌క స‌మీక్ష‌…

-Advertisement-ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌... కాశ్మీర్‌లో ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం...

Related Articles

Latest Articles