పాక్ స‌రికొత్త వ్యూహంః ఆ టెక్నాల‌జీ సొంతం చేసుకుంటే…

పాకిస్తాన్ డ్రోన్ టెక్నాల‌జీని, నాటో వ్యూహాల‌ను అందిపుచ్చుకోవ‌డం కోసం వెంప‌ర్లాడుతున్న‌ది.  ఇందుకోసం ట‌ర్కీతో స‌న్నిహింతంగా మెలుగుతున్న సంగ‌తి తెలిసిందే.  పాక్‌, ట‌ర్కీ దేశాల మ‌ధ్య మంచి సంబందాలు ఉన్నాయి.  ఐరాసాలో పాక్‌కు మ‌ద్ద‌తు తెలిపిన అతి త‌క్కువ దేశాల్లో ట‌ర్కీ కూడా ఒక‌టి.  ట‌ర్కీ వ‌ద్ద బెర్త‌ర్ టీబీ 2 డ్రోన్లు ఉన్నాయి.  ఈ డ్రోన్లు చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి.  వీటి కోసం పాక్ ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టింది. ఈ డ్రోన్ టెక్నాల‌జీని అందిపుచ్చుకొని, భార‌త్ పైచేయి సాధించాల‌ని పాక్ వ్యూహం.  

Read: షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్

అంతేకాదు, ఆఫ్ఘ‌న్‌లో ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన నాటో ద‌ళాల‌తో క‌లిసి ట‌ర్కీ కూడా ప‌నిచేసింది.  ఆ స‌మ‌యంలో నాటో యుద్ధ‌వ్యూహాల గురించి ట‌ర్కీ తెలుసుకుంది.  ఆ వ్యూహాల‌ను ట‌ర్కీ నుంచి తెలుసుకోవ‌డానికి పాక్ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది.  ముఖ్యంగా మాన‌వ‌ర‌హిత డ్రోన్ టెక్నాలజీ క‌లిగిన ట‌ర్కీ ప్ర‌స్తుతం అణుటెక్నాల‌జీ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది.  పాక్ వ‌ద్ద అణుటెక్నాల‌జీ ఉన్న సంగ‌తి తెలిసిందే.  ప‌ర‌ప్ప‌ర టెక్నాల‌జీ బ‌ద‌లాయింపుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ఇప్ప‌టికే పాక్ ట‌ర్కీకి తెలిపింది.  ఇందులో భాగంగానే ట‌ర్కీ జ‌న‌ర‌ల్ పాక్‌కు వ‌చ్చారు.  ర‌క్ష‌ణ రంగానికి సంబందించి అనేక అంశాల‌పై పాక్‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు.  అంతేకాదు, ట‌ర్కీ జ‌న‌ర‌ల్ సేవ‌ల‌ను గుర్తించిన పాక్ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు నిషాన్ ఇ ఇంతియాజ్ అవార్డును ప్ర‌క‌టించింది.  ఒక‌వేళ పాక్ డ్రోన్ టెక్నాల‌జీని సొంతం చేసుకుంటే, దాని వ‌ల‌న భార‌త్‌కు ముప్పు ఉండే అవ‌కాశం ఎక్కువ‌.  ఇటీవ‌లే పాక్ డ్రోన్‌లతో ఇండియా వైమానిక స్థావ‌రాల‌పై దాడులు చేసింది.  దీంతో భార‌త్ మ‌రింత అప్ర‌మ‌త్తం అయింది.  పాక్ డ్రోన్ టెక్నాల‌జీని విస్తృతంగా వినియోగిస్తే ఉప‌ఖండానికి మ‌రింత ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంటుంది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-