పాక్ కొత్త ఎత్తుగ‌డ‌: భార‌త్ ఆస్తులే ల‌క్ష్యంగా…

భార‌త్ ఆస్తుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని పాక్ కొత్త ఎత్తులు వేస్తున్న‌ది. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలీబ‌న్లు ఆక్ర‌మించుకున్న ప్రాంతాల్లోని భార‌త్ కు సంబందించిన ఆస్తుల‌ను ధ్వంసం చేసేందుకు తాలీబ‌న్ ఉగ్ర‌వాదుల‌తో చేతులు క‌లిపింది.  పాక్ చెందిన 10వేల మంది సాయుధులు ఆఫ్ఘ‌న్‌లోకి అడుగుపెట్టారు.  వీరు భార‌త్ స‌హ‌కారంతో నిర్మించిన ప్రాజెక్టులు, భ‌వ‌నాలు, రోడ్ల‌ను ధ్వంసం చేయ‌బోతున్నారు.  ఆఫ్ఘ‌న్ పుననిర్మాణంలో భాగంగా భార‌త్ ఆ దేశంలో 300 కోట్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్టింది.  ఆఫ్ఘ‌నిస్తాన్ కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంతో పాటుగా అనేక ప్రాజెక్టులు, భ‌వ‌నాలు, రోడ్ల‌ను నిర్మంచింది ఇండియా.   2001 నుంచి ఇండియా ఆ దేశంలో పెట్టుబ‌డులు పెడుతూ వ‌స్తున్న‌ది.  తాలిబ‌న్‌లు అనేక ప్రాంతాల‌ను ఆక్ర‌మించుకోవ‌డంతో భార‌త్ నిర్మించిన ఆస్తులను ధ్వంసం చేసేందుకు పాక్ కుట్ర‌లు చేస్తున్న‌ది.  

Read: “ఆర్‌సి 15” కోసం రంగంలోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-