డ్రోన్ దాడుల వెనుక పాక్ హ‌స్తం…బ‌య‌ట‌ప‌డుతున్న నిజం…

జూన్ 27 వ తేదీన డ్రోన్ స‌హాయంతో భార‌త వైమానిక స్థావ‌రంపై దాడులు చేశారు ముష్క‌రులు.   డ్రోన్‌ల నుంచి తెలిక‌పాటి ఐఈడి బాంబులు జార‌విడిచిన ఘ‌ట‌న‌లో వైమానిక స్థావ‌రం పైక‌ప్పు దెబ్బ‌తిన్న‌ది.  కానీ, వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆర్మీ సిబ్బంది డ్రోల్‌ల‌పై కాల్పులు జ‌ర‌ప‌డంతో తప్పించుకుపోయాయి.  అయితే, ఆ ఘ‌ట‌న త‌రువాత భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  డ్రోన్ క‌ద‌లిక‌ల‌పైన దృష్టిసారించింది.  ఇక ఈ డ్రోన్‌ల నుంచి జార‌విడిచిన ప్రెజ‌ర్ ప్యూజులు ఉన్న‌ట్టుగా గుర్తించారు.  ఈ ప్యూజుల‌ను ట్యాంకుల‌ను విధ్వంసం చేసే మందుపాత‌ర‌లోనూ, విమానాల నుంచి జార‌విడిచే బాంబుల్లోనూ ఈ ప్రెజ‌ర్ ప్యూజులను వినియోగిస్తారు.  అదే విధంగా మోర్టార్ బాంబుల్లో కూడా ఈ ప్యూజులు వినియోగిస్తుంటారు.  ఈ టెక్నాల‌జీ ముష్క‌రుల చేతికి అంద‌టం వెనుక పాక్ హ‌స్తం ఉండి ఉంటుంద‌నే అనుమాల‌ను వ్య‌క్తం అవుతున్నాయి. 

Read: తెరపైకి దాసరి బయోపిక్ !

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-