ఆస‌క్తి రేపుతున్న `ప‌చ్చీస్` ట్రైల‌ర్!

తెలుగులో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు వ‌ర‌స క‌డుతున్నాయి. అయితే అవి థియేట‌ర్ల‌లో కాదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో. వాటి టీజ‌ర్స్, ట్రైల‌ర్స్ చూస్తుంటే… ఈ న్యూ వేవ్ మూవీస్ జోరు మ‌రికొంత‌కాలం కొన‌సాగేట్టుగానే క‌నిపిస్తోంది. తాజాగా అలాంటి మూవీ ట్రైల‌ర్ ఒక‌టి ఈ రోజు సాయంత్రం విడుద‌లైంది. థ్రిల్ల‌ర్ జానర్ కు చెందిన ప‌చ్చీస్ మూవీ ట్రైల‌ర్ ను రానా ద‌గ్గుబాటి త‌న సోష‌ల్ మీడియా అక్కౌంట్ ద్వారా వీక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. గ‌తంలో దీని టీజ‌ర్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేయ‌డంతో దానికి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో సెల‌బ్రిటీ స్టైలిష్ రామ్జ్ ప్ర‌ధాన‌పాత్ర పోషించ‌గా, స్వాతి వ‌ర్మ‌, జ‌య‌చంద్ర‌, ర‌వి వ‌ర్మ‌, ద‌యానంద్ రెడ్డి, కేశ‌వ్ దీప‌క్, శుభ‌లేఖ సుధాక‌ర్, విశ్వేంద‌ర్ రెడ్డి ఇత‌ర కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీకృష్ణ‌, రామ సాయి ద్వ‌యం ద‌ర్వ‌క‌త్వంలో కౌషిక్ కుమార్ కాతూరి ఈ సినిమాను నిర్మించాడు. స్మ‌ర‌ణ్ సాయి స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ సినిమాలోని పాట‌ల‌ను మ్యాంగో మ్యూజిక్ లో వినొచ్చు. అయితే యాక్షన్ థ్రిల్ల‌ర్ మూవీని థియేట‌ర్ల‌లో కాకుండా… జూన్ 12న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయ‌బోతున్నారు. గాంబ్లింగ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా ట్రైల‌ర్ ను చూస్తుంటే… వీక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతిని క‌లిగించేట్టుగా ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-