అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ భేటీ.. వాడివేడి చర్చ

ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీ అయింది. విద్యుత్ కొనుగోళ్లు-ప్రభుత్వ సబ్సిడీలపై పీఏసీలో చర్చ జరుగుతోంది. కోవిడ్ కారణంగా సమావేశానికి హాజరు కాలేదు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి. ఇతర అధికారులతో పీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై పీఏసీలో వాడీ వేడీ చర్చ సాగుతోంది.

సోలార్ విద్యుత్ కొనుగోళ్లల్లో లోపాలను ప్రస్తావించారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల. సెకీ టెండర్లను రూ. 2.49కే ఖరారు చేశారా..? అంతకు మించి ఎక్కువగా ఖర్చు అవుతుందా అని ప్రశ్నించిన పయ్యావుల. సరైన సమాచారంతో మళ్లీ వస్తామంది అధికారులు. సంతకాలు.. ఒప్పందాలు చేసేసుకుని సమాచారం లేదంటే.. కమిటీకి సమాచారం ఇవ్వకుండా గోప్యత ప్రదర్శించడమేనన్న పయ్యావుల.

ప్రజలకే కాకుండా.. అసెంబ్లీ కమిటీలకు కూడా సమాచారం ఇవ్వరా అంటూ మండిపడ్డారు పయ్యావుల. రూ. 2.49 కంటే అదనంగా ఖర్చు అవుతుందంటూ అంశాల వారీగా లెక్కలు వివరించారు పీఏసీ ఛైర్మన్. కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, ఐఎస్టీఎస్సుకు ప్రత్యామ్నాయంగా జరిపే చెల్లింపులు, కేంద్ర, రాష్ట్ర గ్రిడ్ల అభివృద్దికి ఒక్కొ యూనిట్టుకు ఎంత ఖర్చవుతుందో లెక్క వేసి చూపించారు పయ్యావుల. సుమారు రూ. 1కు పైగానే అదనపు ఖర్చు అవుతుందని అంగీకరించారు అధికారులు.

కమిటీలో చెప్పిన ప్రతి మాట ఆన్ రికార్డేననే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు పయ్యావుల. అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సమాచారం తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు పయ్యావుల కేశవ్. తర్వాత సమావేశానికి పక్కా సమాచారంతో రావాలంటూ స్పష్టం చేశారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల.

Related Articles

Latest Articles