ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులపై గవర్నరుకు పీఏసీ ఛైర్మన్ ఫిర్యాదు…

ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులపై గవర్నరుకు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ఫిర్యాదు చేసారు. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల పని తీరు దారుణంగా ఉందంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు పయ్యావుల. రూ. 40 వేల కోట్ల ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన రికార్డుల నిర్వహాణ సరిగా లేదంటూ పయ్యావుల సంచలన ఆరోపణ చేసారు. గత రెండేళ్లల్లో ఆర్ధిక శాఖలో జమా ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని గవర్నరుకు దృష్టికి తీసుకెళ్లిన పయ్యావుల… రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో గవర్నర్ జోక్యాన్ని కోరారు. గత రెండేళ్ల ఆర్ధిక శాఖ రికార్డులను స్పెషల్ ఆడిటింగ్ చేయించాలని కోరిన పయ్యావుల… తన ఆరోపణలకు ఆధారంగా ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ కు కాగ్ రాసిన లేఖను గవర్నరుకు సమర్పించారు పయ్యావుల.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-