పాగల్ ‘ప్రైమ్’కు వచ్చేసింది

టాలీవుడ్ యంగ్ యాక్ట‌ర్ విశ్వ‌క్ సేన్ న‌టించిన ‘పాగ‌ల్‌’ చిత్రం అమెజాన్ ప్రైమ్ తేదిని ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ‌గా.. ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమా కావడంతో యూత్ ఎక్కువగా సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ తో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ల‌వ్ డ్రామా నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ చిత్రం ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకుంది. సెప్టెంబరు 3న స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. న‌రేశ్‌ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో నివేదా పేతురాజ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. రధాన్ సంగీతం అందించారు.

Related Articles

Latest Articles

-Advertisement-