ఆస్కార్ విన్నింగ్ లెజెండరీ నటుడు కన్నుమూత

ఆస్కార్ అవార్డు గ్రహీత బహామియన్-అమెరికన్ నటుడు సిడ్నీ పోయిటియర్ మరణించారు. ఆయన వయసు 94 ఏళ్ళు. సిడ్నీకి భార్య జోవన్నా, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. హాలీవుడ్‌లో మొట్టమొదటి నల్లజాతి సినిమా స్టార్‌గా పేరు తెచ్చుకున్న సిడ్నీ పోయిటియర్ ఉత్తమ నటుడి ఆస్కార్‌ను గెలుచుకున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. పోయిటియర్ మరణాన్ని బహమియన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ యూజీన్ టోర్చోన్-న్యూరీ ధృవీకరించారు.

Read Also : ఆ స్టార్ హీరో ప్రేమలో నిధి అగర్వాల్.. త్వరలోనే పెళ్లి..?

ఆయన 1963లో “లిల్లీస్ ఆఫ్ ది ఫీల్డ్”లో తన నటనకు ఆస్కార్ అవార్డును పొందాడు. పౌర హక్కుల ఉద్యమం ద్వారా వచ్చిన సామాజిక తిరుగుబాట్లను అమెరికన్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ప్రసిద్ధ చిత్రాలు జాతి ఉద్రిక్తతలను లేవనెత్తాయి. సిడ్నీ పోషించిన పాత్రలన్నీ అద్భుతాలే అని చెప్పొచ్చు. ఆయన 1967లో ‘టు సర్ విత్ లవ్’లో మార్క్ థాకరేగా, ‘ఇన్ ది హీట్ ఆఫ్ ది నైట్’లో డిటెక్టివ్ వర్జిల్ టిబ్స్‌గా నటించాడు. అదే సంవత్సరంలో విడుదలైన ‘గెస్ హూస్ కమింగ్ టు డిన్నర్‌’లో కూడా నటించాడు. ఈ చిత్రంలో ఆయన హత్య విచారణలో జాత్యహంకారాన్ని ఎదుర్కొనే నల్లజాతి పోలీసు అధికారి వర్జిల్ టిబ్స్‌గా నటించాడు. అదే ఏడాది ‘టు సర్‌ విత్‌ లవ్‌’లో లండన్‌ స్కూల్‌ టీచర్‌ పాత్రలో నటించాడు.

ఇక సిడ్నీ కేవలం నటుడే కాదు సిడ్నీ పౌర హక్కుల కార్యకర్త కూడా. దానికోసం ఆయన చేసిన కృషికి 2009లో అమెరికా అధ్యక్షుడు ఒబామా ద్వారా US ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం లభించింది. ఆయనకు యూఎస్ తో పాటు బహామాస్ పౌరసత్వం కూడా ఉంది. 1997 నుంచి 2007 వరకు జపాన్‌లో బహామియన్ రాయబారిగా పనిచేశాడు. సినిమాల్లో ఐదు దశాబ్దాల కెరీర్‌లో సిడ్నీ నటుడిగా, దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. 1997లో విడుదలైన ‘జాకిల్’ చిత్రంలో ఆయన చివరిసారిగా తెరపై కనిపించారు. 1963లో ఆస్కార్ తో పాటు, సిడ్నీ 2001లో గౌరవ అకాడమీ అవార్డును కూడా అందుకున్నాడు.

Related Articles

Latest Articles