ఈ సారి కైట్‌ ఫెస్టివల్‌ లేనట్టే..

హైదరాబాద్‌లోని అంతర్జాతీయ గాలిపటాలు, స్వీట్ ఫెస్టివల్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వరుసగా రెండో ఏడాది కూడా నగరంలో మూడు రోజుల అంతర్జాతీయ గాలిపటాలు స్వీట్ ఫెస్టివల్‌ను నిలిపి వేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా తెలిపారు. జనవరి 14 నుంచి 16 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్‌ జరగాల్సి ఉంది. మత, రాజకీయ, సాంస్కృతిక సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలు మరియు సామూహిక సభలపై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీగా వస్తోంది. 2016 నుండి పర్యాటక శాఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయ మరియు అంతర్జాతీయ పతంగుల ఫ్లైయర్‌లను ఆహ్వానించి పతంగుల పండుగను నిర్వహిస్తోంది.

Read Also: రాఘవ రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు

ఈ ఫెస్టివల్‌ ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత హైదరాబాద్‌లో ఎప్పుడు నిర్వహించేలా ఈ ఈవెంట్‌ను తీర్చిదిద్దారు. కాగా వివిధ రాష్ట్రాల ప్రజలు తయారుచేసిన సాంప్రదాయ స్వీట్‌లను కూడా ఈ కైట్‌ ఫెస్టివల్‌లో పంచుతారు. అందుకే ఈ కైట్‌ ఫెస్ట్‌వల్‌ కాస్త స్వీట్‌ ఫెస్టివల్‌గా ప్రాచుర్యం పొందింది. కానీ గతేడాది కరోనా కారణంగా ఈ ఈవెంట్‌ జరగలేదు. ఈసారికూడా కరోనా, ఒమిక్రాన్‌ నేపథ్యంలో కైట్‌ ఫెస్టివల్‌ను నిర్వహించడంలేదు. కోవిడ్-19 కారణంగా, నుమాయిష్‌ కూడా ప్రారంభం అయిన తరువాత ప్రభుత్వం నిలిపి వేసింది.

Related Articles

Latest Articles