ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ రంగంలోకి మ‌రో మొబైల్ కంపెనీ… 2024 ల‌క్ష్యంగా…

దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  అనేక కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నాయి.  టూవీల‌ర్స్‌తో పాటుగా, కార్ల త‌యారీ వినియోగం, ఉత్ప‌త్తి పెరుగుతున్న‌ది.  ఈ రంగంలోకి వాహ‌నాల త‌యారీ సంస్థ‌ల‌తో పాటుగా ప్ర‌ముఖ మొబైల్ కంపెనీలు కూడా ప్ర‌వేశిస్తున్నాయి.  యాపిల్‌, గూగుల్‌, హువావే, షావోమీ మొబైల్ సంస్థ‌లు ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేస్తున్నాయి.  

Read: ఐపీఓకి మ‌రో కంపెనీ ధ‌ర‌ఖాస్తు… రూ.900 కోట్లు స‌మీక‌ర‌ణే ల‌క్ష్యం…

కాగా, ఇప్పుడు ఒప్పో మొబైల్ కంపెనీకూడా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేసేందుకు సిద్ధం అయింది.  2024 ను ల‌క్ష్యంగా చేసుకొని ఒప్పో కంపెనీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం.  ఇండియా మార్కెట్‌ను ల‌క్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ వాహ‌నాల‌ను త‌యారు చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles