ఏపీ వ్యవహారాలపై దృష్టిసారించిన రాహుల్..

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్‌ గాంధీ దృష్టిసారించారు.. రాహుల్‌తో సమావేశమైన ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ ఉమెన్ చాందీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. బలోపేతానాకి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్‌ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం.. రాష్ట్రానికి చెందిన పలు సీనియర్లకు జాతీయస్థాయులో పార్టీలో బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారని చెబుతున్నారు.. ఏపీలో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ కదిలించేందుకు.. పార్టీలో చుకురుగా పనిచేసే విధంగా కార్యాచరణ తయారు చేయనున్నారు.. దీనికోసం పిసిసి కార్యవర్గంలో మార్పులు, చేర్పులపై కూడా చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. ఇక, ఏపీలో పర్యటించాల్సిందిగా ఈ సందర్భంగా.. రాహుల్‌ గాంధీని ఉమెన్ చాందీ కోరినట్టుగా చెబుతున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-