బీటీఎస్ వీడియో : సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్

ఇటీవల విడుదలైన ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సామ్ ఈ సాంగ్ లో హాట్ గా కన్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2021లో టాప్ 100 సాంగ్స్ లో ఈ సాంగ్ మొదటి స్థానంలో నిలిచిందన్న విషయం తెలిసిందే. మరి ఇంతగా అలరించిన ఈ సాంగ్ ను సామ్ ఎలా ప్రాక్టీస్ చేసిందో తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటూ ఉంటారుగా. అలాంటి వారి కోసమే సామ్ ‘ఊ అంటావా’ సాంగ్ రిహార్సల్స్ కు సంబంధించిన బీటీఎస్ వీడియోను పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : ఇండస్ట్రీలో కరోనా కలకలం… హీరోయిన్ కు పాజిటివ్

వీడియోలో సామ్ చాలా అందంగా డ్యాన్స్ రిహార్సల్ చేస్తూ కనిపిస్తుంది. కొరియోగ్రాఫర్‌లతో ఆమె కష్టపడి పని చేయడం, సరదాగా ఉండడంతో పాట కోసం డ్యాన్స్ పై కూడా పూర్తిగా దృష్టిని సారించింది. సాంగ్ కోసం సామ్ చేసిన హార్డ్ వర్క్ ప్రశంసనీయం అంటున్నారు ఆమె అభిమానులు. ఈ వీడియోను షేర్ చేస్తూ సామ్ “తరచుగా మనం బాగా ప్రాక్టీస్ చేసే విషయాలు తెరపైకి రాకుండా ఉంటాయి. ఈ అద్భుతమైన కొరియోలో నేను చాలా సరదాగా నేర్చుకున్నాను” అంటూ రాసుకొచ్చింది. ఇంతకుముందు కూడా సామ్ ఈ సాంగ్ కు సంబంధించిన ఓ పోస్టులో సాంగ్ లో సెక్సీగా కనిపించడానికి చాలా కష్టపడ్డానని చెప్పకొచ్చింది. ఎలాగైతేనేం ‘ఊ అంటావా’ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే ! ప్రస్తుతం సామ్ ‘శాకుంతలం’, ‘యశోద’ అనే పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. ఇందులో ‘శాకుంతలం’ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా, ‘యశోద’ రెండవ షెడ్యూల్ ను తాజాగా మొదలు పెట్టింది సామ్.

Related Articles

Latest Articles