జూన్ 3న కేర‌ళకు నైరుతి రుతుప‌వ‌నాలు

నైరుతి రుతుపవనాలు జూన్‌ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకోనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి మే 31న కేరళకు రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ మొదట అంచనా వేసింది. ప్రస్తుతం జూన్‌ 3న కేరళను తాకుతాయని చెబుతోంది. రాగల మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్ల‌డించింది. ఉరుములు, మెరుపులతో పాటు, ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-