అత్య‌ధిక వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేసే దేశం మనది.. కానీ?: ప్రియాంకా గాంధీ

వ్యాక్సిన్ల కొర‌త అంశంపై కేంద్ర ప్ర‌భుత్వాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది. వ్యాక్సిన్ స‌మ‌స్య ఉత్ప‌న్నం కావ‌డానికి మోదీయే కార‌ణ‌మ‌న్నారు. మోదీ స‌ర్కార్ గ‌త ఏడాదే వ్యాక్సినేష‌న్ ప్లాన్ వేసింద‌ని, కానీ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కేవ‌లం కోటి 60 ల‌క్ష‌ల టీకాల‌కు మాత్ర‌మే ఎందుకు ఆర్డ‌ర్ చేశార‌ని ఆమె ప్ర‌శ్నించారు. దేశ ప్ర‌జ‌ల‌కు మోదీ ప్ర‌భుత్వం త‌క్కువ సంఖ్య‌లో టీకాలు కేటాయించింద‌ని, కానీ ఎక్కువ సంఖ్య‌లో విదేశాల‌కు టీకాలు అమ్మిన‌ట్లు ప్రియాంకా ఆరోపించారు. ప్ర‌పంచంలో అత్య‌ధిక స్థాయిలో వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేసే దేశం ఇండియానే అని, కానీ మ‌నం ఇప్పుడు ఇత‌ర దేశాల‌ను వ్యాక్సిన్ల‌ను అడుక్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పై మోదీ ఫొటోతో ప్రచారం చేయడం సరికాదన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-