తెలంగాణలో మళ్లీ ఆన్‌లైన్ క్లాసులు..!!

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మళ్లీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈనెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న సమయంలో భౌతిక తరగతుల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు వేచి చేస్తున్నారు.

Read Also: అరెస్టు చేసిన టీచర్లందరిని వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్‌

ఈ మేరకు ఈనెల 17 నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16న దీనిపై విద్యాశాఖ అధికారిక ప్రకటన చేయనుంది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ఇప్పటికే విద్యాధికారుల ప్రభుత్వానికి మార్గదర్శకాలను అందించినట్లు తెలుస్తోంది.  మరోవైపు కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 17 నుంచి 22 వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఇప్పటికే హైదరాబాద్ జేఎన్టీయూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles