ఈ బుడతడి నెల సంపాదన వింటే షాకవుతారు

అమెరికాకు చెందిన ఓ బుడతడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాది వయసు గల ఈ చిన్నారి నెల సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ చిన్నారి ట్రావెల్ చేస్తూ కళ్లుచెదిరేలా సంపాదిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన జెస్ అనే మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని ఆమె భయపడిందట. వెంటనే ఈ మాటను తన భర్తకు చెప్పగా… అతడు ప్రోత్సహించాడట. దీంతో ఆమె ఓ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి తాను ట్రావెల్ చేసిన ప్రదేశాల విశేషాలను సదరు సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసేదట. అప్పటికి బేబీ ట్రావెల్‌కు సంబంధించిన సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు లేకపోయేసరికి జెస్ ప్రారంభించిన సోషల్ మీడియా ఖాతాకు విపరీతమైన ఆదరణ దక్కిందని ఆమె స్వయంగా వెల్లడించింది.

Read Also : పేటీఎంకు ఆర్.బి.ఐ షాక్

అలా బేబీ ట్రావెల్ సైట్‌ను జెస్ ప్రారంభించగా.. అప్పటి నుంచి బిగ్ర్స్ పుట్టినతర్వాత కూడా ఆమె ట్రావెలింగ్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తోంది. మూడు వారాల వయసులోనే బేబీ బ్రిగ్స్ తొలి టూర్ వెళ్లాడు. ఇప్పటివరకు అతడు అమెరికాలోని 16 రాష్ట్రాలను చుట్టేశాడు. 45 విమానాలలో ప్రయాణించాడు. అలాస్కా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఇదాహో, యూటా సహా పలు రాష్ట్రాలలో సంచరించాడు. సదరు ప్రాంతాలకు చెందిన విశేషాలతో బ్రిగ్స్ అనే బుడతడు నెలకు ట్రావెల్ సైట్ ద్వారా వెయ్యి డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.75వేలు సంపాదిస్తున్నాడు. బ్రిగ్స్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 30వేల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఇదే కాకుండా పార్ట్ టైమ్ టూరిస్ట్స్ పేరిట ఓ బ్లాగ్‌ను కూడా జెస్ నడుపుతోంది.

Related Articles

Latest Articles