వన్ ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్.. ఫీచర్లు చూశారా?

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్ సంస్థకు మంచి స్థానం ఉంది. వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ వన్ ప్లస్ సంస్థ క్రేజీ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. ఇప్పటికే నార్డ్ సిరీస్‌లో పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన వన్ ప్లస్ ఇప్పుడు మరో ఆకట్టుకునే డిజైన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. నార్డ్ 2 ప్యాక్ మాన్ ఎడిషన్ పేరుతో కొత్త స్మార్‌ ఫోన్‌ను వన్ ప్లస్ సంస్థ విడుదల చేసింది. నవంబర్ 16 మధ్యాహ్నం తర్వాత ఈ ఫోన్ అమ్మకాలు యూకే, ఇండియాలో వన్‌ప్లస్ సంస్థ వెబ్‌సైట్, అమెజాన్‌లో ప్రారంభం అవుతాయి. వీడియో గేమ్‌లు ఆడుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్‌ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోన్ ధర రూ.37,999గా వన్‌ ప్లస్ సంస్థ నిర్ణయించింది.

ఫీచర్లు:
1) 50 MP మెయిన్ కెమెరా
2) 45000mAh బ్యాటరీ
3) 65W ఛార్జింగ్ సదపాయం
4) 90Hz అమోల్డ్ డిస్‌ప్లే
5) 12GB ర్యామ్ (RAM), 256 GB ఇంటర్నల్ స్టోరేజ్
6) నార్డ్ 2 డ్యూయల్ SKUs

Read Also: మాల్దీవులకే మంటలు పుట్టిస్తున్న బుట్టబొమ్మ

Related Articles

Latest Articles