ఫేక్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్స్… వ్యక్తి అరెస్ట్

ఫేక్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ ను తయారు చేస్తున్న‌ వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. నాచారంకి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కిరణ్ ను అరెస్ట్ చేసారు జవహార్ నగర్ పోలీసులు. కుషాయిగూడ కు చెందిన ఓ కుటుంబాన్ని ఫెక్ కోవిడ్ రిపోర్ట్ లతో మోసం చేసారు. కోవిడ్ లక్షణాలు‌ ఉండటంతో తెలిసిన వ్యక్తి ‌కదా అని కిరణ్ ని సంప్రదించారు. అనంతరం ఇంటికొచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసిన కిరణ్… ఓ ల్యాబ్ లో టెస్ట్ చేయించానంటూ క్యూఆర్ కొడ్ తో సహా ఫేక్ పత్రాలను ఆ కుటుంబానికి‌ పంపాడు. అనుమానం వచ్చి ల్యాబ్ ను సంప్రదించిన ఆ కుటుంబానికి కిరణ్ ఎవరో వారికి తెలియదని ఆ టెస్ట్ లు ఇక్కడ జరగలేదని తెలిపారు. బాధిత కుటుంబం‌ నుండి పలు టెస్ట్ ల‌ కోసం రూ. 19 వేలు దోచాడు కిరణ్. అయితే ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబ్స్ లోనే పరీక్షలు చేసుకోవల్సిందిగా రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ సూచించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-