‘మాచర్ల నియోకవర్గం’లోకి ఎంటర్ అయిన హాట్ బ్యూటీ..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో నితిన్ సరసన కృతిశెట్టి నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో క్యాథరిన్ ధెరిస్సా నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో జరిగే షూటింగ్ లో పాల్గొన్నట్లు మేకర్ తెలిపారు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 29 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో క్యాథరిన్ కి విజయం దక్కుతుందో లేదో చూడాలి.

Related Articles

Latest Articles