హాలీవుడ్ తెరపై ‘అమెరికా ప్రెసిడెంట్’! హ్యారిసన్ ఫోర్డ్ టాప్ 5 ఐకానిక్ క్యారెక్టర్స్…

హాలీవుడ్ వెటరన్ యాక్టర్ హ్యారిసన్ ఫోర్డ్ జూలై 13న తన 79వ జన్మదినం జరుపుకున్నాడు. అయితే, త్వరలో 80వ వడిలోకి చేరుతోన్న ఈ లెజెండ్రీ పర్ఫామర్ తన కెరీర్ లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ అందించాడు. వాటిల్లోంచి టాప్ ఫై హ్యారిసన్ ఫోర్డ్ క్యారెక్టర్స్ ని ఇప్పుడు చూద్దాం! ఈ అయిదూ ఆయన తప్ప మరెవరూ చేయలేరనేది నిస్సందేహంగా నిజం!

‘పాట్రియాట్ గేమ్స్, క్లియర్ అండ్ ప్రజెంట్ డేంజర్’ సినిమాల్లో జాక్ రయాన్ పాత్రలో యాక్షన్ పండించాడు హ్యారిసన్ ఫోర్డ్. అయితే, ఆయన కంటే ముందు… తరువాత కూడా… జాక్ రయాన్ క్యారెక్టర్ చాలా మంది పోషించారు. కానీ, ఫోర్డ్ సదరు పాత్రకి తిరుగులేని ప్రతిరూపంగా నిలిచిపోయాడు.

రిడ్లీ స్కాట్ రూపొందించిన ‘బ్లేడ్ రన్నర్’ సైన్స్ ఫిక్షన్ సినిమా. అయినా కూడా తన క్యారెక్టర్ ‘రిక్ డికార్డ్’తో చరిత్రలో నిలిచిపోయాడు టాలెంట్ యాక్టర్. ఎవరైనా ఇప్పటికీ ‘బ్లేడ్ రన్నర్’ చూస్తే సినిమా, అందులోని స్టోరీ, విజువలైజేషన్… అన్నిటికంటే కూడా హీరో క్యారెక్టర్ తోనే ప్రేమలో పడిపోతారు!

‘ఎయిర్ ఫోర్స్ వన్’ సినిమా తెలియని హాలీవుడ్ మూవీ లవ్వర్స్ ప్రపంచంలో దాదాపుగా ఎవ్వరూ ఉండరు. అంతలా ఫేమస్ అయిన ప్రెసిడెన్షియల్ మైల్ స్టోన్ మూవీలో అమెరికా అధ్యక్షుడిగా అలరించాడు ఫోర్డ్. రియల్ యూఎస్ ప్రెసిడెంట్స్ అందరిలాగా సైన్యానికి ఆదేశాలు ఇవ్వటం కాకుండా… ఈ రీల్ వైట్ హౌజ్ హీరో… తానే స్వయంగా యాక్షన్ లోకి దూకుతాడు! అమెరికా అధ్యక్షుడు రష్యన్ టెర్రరిస్టుతో ఫైట్స్ చేయటం అప్పుడు, ఇప్పుడు కూడా మెస్మరైజ్ చేసే సీన్…

హ్యాన్ సోలో పాత్రలో ‘స్టార్ వార్స్’ను రక్తి కట్టించాడు హ్యారిసన్ ఫోర్డ్. విలన్ క్యారెక్టర్ అయినా తాను ఎంత క్లాసీగా ప్రజెంట్ చేయగలడో ఈ సినిమాలో నిరూపించాడు. ఐకానిక్ డైలాగ్స్ తో పాటూ ఎవర్ గ్రీన్ కామెడీ కూడా హ్యాన్ సోలో లాంటి నెగటివ్ క్యారెక్టర్ లో ఉండటం… దాని పాప్యులారిటికి కారణం!
ఫోర్డ్ సుదీర్ఘ కెరీర్ లో ‘హ్యాన్ సోలో’ పాత్ర, ‘ఇండియానా జోన్స్’ క్యారెక్టర్… ఏది బెస్ట్ అంటే ఎంతటి క్రిటిక్ కూడా తేల్చి చెప్పలేడు. రెండూ అంతగా ఆయన ఫ్యాన్స్ ని మాయ చేశాయి. ప్రపంచ సినీ చరిత్రలో నటనకి గీటురాళ్లుగా మిగిలిపోయాయి!

అయితే, ‘స్టార్ వార్స్’లోని హ్యాన్ సోలో కంటే ‘ఇండియానా జోన్స్’లోని ఇండియానా జోన్స్ టైటిల్ రోల్ ఫోర్డ్ కి మరింత ఎక్కువ స్కోప్ అండ్ షేడ్స్ ని ఇచ్చింది. వృత్తి రిత్యా ప్రొఫెసర్ అయిన ‘ఇండియానా జోన్స్’ ఓ సారి క్రీస్తు పూర్వపు నాటి సమాధుల మధ్యకి వెళ్లిపోతాడు. ఇంకోసారి హిట్లర్ కాలపు నాజీల్ని ఎదురిస్తుంటాడు. ఓ ఆర్కియాలజీ ప్రొఫెసర్ తలపై తన ఐకానిక్ హ్యాట్ పెట్టుకుని సాహసాలు చేయటం… యాక్షన్ ప్రియుల్ని మరో మాట లేకుండా మోహంలో పడేసింది! కాబట్టి, 79 ఏళ్ల హ్యారిసన్ ఫోర్డ్ లెజెండ్రీ కెరీర్ లో ఇండియానా జోన్స్ టాప్ వన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-