అతడిని కోటీశ్వరుడిని చేసిన 157 చేపలు…

ఎవ‌ర్ని ఎప్పుడు ఎలా అదృష్టం వ‌రిస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేరు.  నమ్ముకున్న వృత్తి వ‌ల‌న మొద‌ట్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు.  ఎప్పుడోక‌ప్పుడు అదే వృత్తి అత‌నికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.  అందులో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు.  వ‌ర్షాకాలం, పైగా స‌ముద్రంలో అల‌జ‌డి అధికంగా ఉండ‌టంతో గ‌త నెల రోజులుగా స‌ముద్రంలో వేట‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు.  నెల రోజుల త‌రువాత తాజాగా ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు రావ‌డంతో చంద్ర‌కాంత్ అనే మ‌త్స్య‌కారుడు ముంబై-పాల్ఘ‌ర్ స‌ముద్రంలో వేట‌కు వెళ్లాడు.  ప‌దిమందిని తీసుకొని వేట‌కు వెళ్లిన చంద్ర‌కాంత్ వ‌ల‌కు 157 చేప‌లు చిక్కాయి.  అయితే ఈ చేప‌లన్నీ కూడా ఘోల్ జాతికి చెందిన చేప‌లు కావ‌డంతో అత‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది.  చంద్ర‌కాంత్ బోటు ఒడ్డుకు చేరుకోగానే వ్యాపారులు ఆ చేప‌ల‌ను కొనుగోలు చేసేందుకు పోటీ ప‌డ్డారు.  ఒక్కో చేప‌ను రూ.85 వేల చొప్పున కొనుగోలు చేశారు.  దీంతో రాత్రికి రాత్రే చంద్ర‌కాంత్ కోటీశ్వ‌రుడ‌య్యాడు. న‌మ్ముకున్న వృత్తి త‌న‌కు అన్యాయం చేయ‌లేద‌ని చంద్ర‌కాంత్ పేర్కొన్నాడు.  

Read: ఇది జ‌ల‌పాతం కాదు…ఢిల్లీ ప్లైఓవ‌ర్‌…

Related Articles

Latest Articles

-Advertisement-